Natho Vasthava

Natho Vasthava

Udit Narayan

Альбом: Mass
Длительность: 4:54
Год: 2004
Скачать MP3

Текст песни

నాతో వస్తావా నాతో వస్తావా
నా ప్రాణం అంతా నీకే ఇస్తా నాతో వస్తావా
నీతో వస్తాలే నీతో వస్తాలే
నీ గుండెల్లోన గూడే కడితే నీతో వస్తాలే
నీ అడుగు అడుగున తోడుంటా నాతో వస్తావా
ఏడడుగులింక నను నడిపిస్తే నీతో వస్తాలే
ఆకాశమైన అరచేతికిస్తా మరి నాతో వస్తావా
హొయ్ గోరి గోరి గోరి గోరి గోలుకొండ ప్యారీ రావె నా సంబరాల సుందరి
హేయ్ చోరిచోరి చోరి చోరి చేయజారకోరి నీదే సోయగాల చోకిరి

మదిలో మెదలే ప్రతి ఆశా నువ్వు
ఎదలో కదిలే ప్రతి అందం నువ్వు
హృదయం ఎగిసే ప్రతి శ్వాసా నువ్వు
నయనం మెరిసే ప్రతి స్వప్నం నువ్వు
రేయి పగలు నా కంటిపాపలో నిండినావె నువ్వే
అణువు అణువు నీ తీపి తపనతో తడిసిపోయే కలలే
హేయ్ గింగిరాల బొంగరాల టింగురంగసాని రావే నా జింగిలాల జిగినీ
హే రంగులేని ఉంగరాలు వేలు వెంట జారి మెళ్ళో నీ తాళిబొట్టు పడనీ

నాతో వస్తావా నాతో వస్తావా
నా ప్రాణం అంతా నీకే ఇస్తా నాతో వస్తావా

అరెరే అరె రే తేనూరే పెదవి
మెలికే పడని నను నీలోపొదివి
పడితే నదిలా వరదయ్యే నడుము
పరదా విడనీ నీదయ్యే క్షణము
పరువమెందుకీ పరుగులాటవే పరుపు చేరు వరకూ
పడుచు వయసులో అంచు పైటలే బరువులాయె నాకు
హోయ్ చెంతకింక చేర చేర సిగ్గులెందుకోరి రావే నా బంతిపూల లాహిరి
హోయ్ చెంగులోన దూరి దూరి గింగురెత్తి పోరి కొంగే గొడుగెత్తుకుంది జాంగిరీ

నాతో వస్తావా నాతో వస్తావా
నా ప్రాణం అంతా నీకే ఇస్తా నాతో వస్తావా
నీతో వస్తాలే నీతో వస్తాలే
నీ గుండెల్లోన గూడే కడితే నీతో వస్తాలే