Samayama
Anurag Kulkarni
3:25వెలుగారునా నిశి పూసినా వెలివేసినా మది వీడునా గుండె కన్నుమూసిన విధి రాసిన కల కాలిపోవు నిజమైన నిన్ను వదలకుమా వదలకుమా బెదురెరుగని బలమా నదివే నువ్వు నదివే నీ మార్పే రానుంది వినవే నదివే నువ్వు నదివే నీకే నువ్వు ఇయ్యాలి విలువే సిలువ బరువేమోయకా సులువు భవితెలీదుగా వెన్నెల వలదను కలువవు నువ్వు కావా కాలేవా ఓహో హో తడువు గురుతులై ఇలా తరుము గతమునావనా ఎటు కదలని నిమిషం నులిమిన గొంతుకవా నటనిక చాలనే ఎద మోసినా కొన ఊపిరున్న చైతన్యం నువ్వు వదలకుమా వదలకుమా సరికోరే నిజమా నదివే నువ్వు నదివే నీ మార్పే రానుంది వినవే నదివే నువ్వు నదివే నీకే నువ్వు ఇయ్యాలి విలువే మునుముందే వెలుగుంది నిన్నల్లో నిశి దాగున్న మునుముందే వెలుగుంది దారే ముసుగుపోతున్న మునుముందే వెలుగుంది ఆగద్దు ఏదేమైనా మునుముందే వెలుగుంది దాటై ఆటు పోటైనా మునుముందే వెలుగుంది కలలే విడొద్దంటున్న మునుముందే వెలుగుంది తెలుపేగా హరివిల్లైనా మునుముందే వెలుగుంది ఉనికిని మరువద్దంటున్న మునుముందే వెలుగుంది నీ వెలుగై నేనొస్తున్నా నదివే