Notice: file_put_contents(): Write of 640 bytes failed with errno=28 No space left on device in /www/wwwroot/muzbon.net/system/url_helper.php on line 265
Hymath Mohamme - Kalam Nitho Nadavadu | Скачать MP3 бесплатно
Kalam Nitho Nadavadu

Kalam Nitho Nadavadu

Hymath Mohamme

Длительность: 4:01
Год: 2023
Скачать MP3

Текст песни

కాలం నీతో నడవదు నిన్నడిగీ ముందుకు సాగదు
సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధము
విజయం నేరుగా చేరదు శ్రమ పడితే దక్కక మానదు
నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి క్షణమూ విలువని తెలుసుకో
ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడగదు
మంచోడివా చెడ్డోడివా ఏ మతము నీది అని అడగదు
ప్రేమ జాలీ చూపదు దయదాక్షిణ్యాలే ఉండవు
ప్రేమ జాలీ చూపదు దయదాక్షిణ్యాలే ఉండవు
దానికి విలువని ఇస్తే గెలుస్తవు అది మరిచితే అక్కడే ఆగుతవు
కాలం నీతో నడవదు నిన్నడిగీ ముందుకు సాగదు
సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధము

మనకున్న టైము సరిపోదు తమ్మి జర జల్దీ మేలుకోరో
సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే
మనకున్న టైము సరిపోదు తమ్మి జర జల్దీ మేలుకోరో
సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే
క్రమపద్ధతి లేని జీవనం కాలం విలువను మరిచిన
సమయాభావం గొప్పది అది లేదని చెప్పితే కుదరదే
గెలిచిన వీరుడి మనసుని అడుగు సమయం విలువేంటో
గడిచిన నీ గత కాలాన్నడుగు కోల్పోయిందేంటో
అది తెలుసుకొని ముందుకు పోతే విజయం నీ బానిసరా
కాలం నీతో నడవదు నిన్నడిగీ ముందుకు సాగదు
సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధము

ఒకసారి నువ్వు బతిమాలి చూడు కోల్పోయిన కాలాన్ని
తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి
ఒకసారి నువ్వు బతిమాలి చూడు కోల్పోయిన కాలాన్ని
తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి
నిన్నే నిన్నుగా మలిచే ఉలిరా సమయం అంటే తమ్ముడా
విలువలతోని బతికే బ్రతుకును అందిస్తదిరా నిండుగా
క్రమశిక్షణను నేర్పిస్తదిరా సమయం అనునిత్యం
స్వేరో సైనికుడై సాగరా కాలం నీ నేస్తం
ఆ జెండా ఎత్తి నడవర తమ్ముడా ధైర్యం నీకనునిత్యం