Oh Prema

Oh Prema

Vishal Chandrashekhar, Kapil Kapilan, Chinmayi, And Krishna Kanth

Длительность: 3:29
Год: 2022
Скачать MP3

Текст песни

వస్తా నే వెంటనే
ఉంటా నీవెంటనే

ముద్దంటిన చెంపపై
తడి ఆరనేలేదులే
మాటొకటి చెప్పేంతలో
పయనాలు మొదలాయెనే

ఓ ప్రేమా (ఓ ప్రేమా)
అవసరమా (అవసరమా)
మాయే నీ (మాయే నీ)
చిరునామా (చిరునామా)

మనసంతా నీవే ప్రియా
విరహాన్ని చంపేదెలా
అంతరిక్షం అంచుదాక ప్రేమే తాకిందిగా
నీతో జ్ఞాపకాలే ఈ మంచులా అవి కరగవే
ఈ నీ పరిమళాలు గుండెలో నిండెలే

ఓ ప్రేమా (ఓ ప్రేమా)
అవసరమా (అవసరమా)
మాయే నీ (మాయే నీ)
చిరునామా (చిరునామా)

ఇటు చూడవా ప్రియతమా
ఎడబాటు అనుకోకుమా
కాలికిందే చిక్కుకుంది చూడు నా ప్రాణమే
దూరం ఆవిరాయే నీ వెచ్చని నిశ్వాసలో
నిదురే చెదిరేలోపే తిరిగిరా స్వప్నమా

ఓ ప్రేమా (ఓ ప్రేమా)
అవసరమా (అవసరమా)
మాయే నీ (మాయే నీ)
చిరునామా (చిరునామా)