Karma Song

Karma Song

B. Ajaneesh Loknath, Rambabu Gosala, & Venkatesh D. C.

Длительность: 4:04
Год: 2025
Скачать MP3

Текст песни

కర్మే రాయిగా కాలికి తగిలితే
రేగిన గాయమే మానునా
ధర్మమే తప్పుతూ దర్పమే చూపితే
కరుణతో దైవమే బ్రోచునా
పుడమిని ప్రళయంలా మింగే
మెరుపు ధారే విళపించేలా
నేల తల్లి ఒడికి ఒరిగిపోతూ

హే హా హే ఓ देना
హరే హరో मेरा నేనో రే
ఓ ఓర్చుకునే బాధకాదీ తలరాత
బ్రతుకంతా వెంటపడుతూ తరిమేనటా
మార్చుకొనే వీలులేదే విధిరాత
నీలోనే నిను వెతుకుతూ కదలాలటా
విడిచిపెట్టుతున్నా మన పాపం గంగల్లోనా
వదిలిపెట్టదంటా పశ్చాత్తాపం కల్లోనైనా
అహముతో ఎగిరావంటే మెళ్లో పూలమాలే
రాలీ రాలే దండ విడిచి ఆ పువ్వులే

హే హా హే ఓ देना
హరే హరో मेरा నేనో రే
ఓ చావుకన్నాఘోరమంట ఈ బ్రతుకు
వ్యధ తీరే దారేదంటే చితిమంటయే
ఆదిలోనే సిద్దమంటా ముగియింపు
అది తెలుసుకోక జీవం బరువాపదే
అమ్మ రొమ్ముపాలే నెత్తురల్లే మారిపోతే
ఎవరిదింత పాపం చెప్పమంటే గొంతురాదే
విధినే గెలిచేందుకు పాచికలేస్తూ ఉంటే
ఆ విధి ఆడే ఆటలకు అంతముండదంతే

హే హా హే ఓ देना
హరే హరో मेरा నేనో రే